Saturday 1 June 2013

నవ్వు వస్తే నవ్వుకోండి క్లాసు లు మాత్రం పీకకండి

అసలు దీన్ని ఏమనాలో కూడా తెలియని పరిస్థితి ...... ఛి నా బతుకు ...

ఈ సంగటన ఒక 6 సంవస్తరాల క్రితం జరిగింది ..... నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ....... కొత్త బిచ్చ గాడు పొద్దు ఎరగడు అనట్టు బయట తెగ తిరిగే వాడిని ....... ఒక రోజు కుకట్పల్లి లో ఫ్రెండ్ ని కలుద్దాం అని బయలు దేర ... దారిలో ఒకావిడ వయసు 40+ ఉండొచ్చు ... కొంచెం నల్లగా గానుగ ఎద్దు లాగఉంది ... ఏడుస్తూ రోడ్ మిద పరిగెడుతుంది కంగారుగా ... 

నాకు జాలి వేసి ఎమ్మా ఎవరికన్నా ఎమన్నా అయ్యిందా ఎక్కడన్నా డ్రాప్ చెయ్యమంటారా అని అడిగా ....దానికి ఆమె చెప్పిన సమాధానానికి నా తలకాయి తీసుకెళ్ళి బస్సు కింద పెట్టిన తప్పులేదని అనిపించింది ......

ఒంటరిగా అమ్మాయి కనపడితే చాలు ప్రేతి ఒక్కడికి లోకువే ... అబేసి పరిగెత్తుకుంట వెళ్ళిపోయింది

ఆ మాటతో నాకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది ...//ఒంటరిగా అమ్మయ //    ఇవిడ ఆంటీ కదా అమ్మాయిల ఫీల్ అవుతున్న ఆవిడా అమాయకత్వానికి నవ్వుకోవాలో ఆమె అన్న మాటకి బాధ పడాలో అర్ధం కాని పరిస్థతి ... ఛి నా బ్రతుకు చేడ  

దేనిలోని నీతి ఏంటంటే గాలికి పోయే కంపని ప్యాంటు కి తగిలించుకోకుడదు

No comments:

Post a Comment