Saturday 1 June 2013

వోటరు ఇదీ మేటరు ............1


అనగనగ ఒక ఉరిలో ఒక వేటగాడు ఉన్నాడు (సిబిఐ) వాడు రూజు వేటకి అడవికి వెళ్ళేవాడు ఎన్నో జంతువులని పట్టుకునే వాడు ......

ఒక రోజు వేటకి వెళుతుండగా ఒక ముసలి రాబందు(బిజియమ్మ ) వేటగాడికి ఎదురయింది .... అది ఆ వేటగాడిని ఇలా వేడుకుంది .... ఇప్పటికి నువ్వు మా జాతి లోని చాలా వాటిని పట్టుకున్నావ్ .... నా బిడ్డను(గజన్) మాత్రం వదిలి పెట్టు నీకు పుణ్యం ఉంటది అని వేడుకుంది ...... పాపం వేటగాడు సరే నీ బిడ్డఎలా వుంటాడో చెప్పు అని అడిగాడు .. ఇంకా రాబందు చెప్పటం మొదలెట్టింది ...

నా బిడ్డ ఈ ప్రపంచంలోకెల్లా అందగాడు ....

నా బిడ్డ ఈ ప్రపంచం లో కెల్లా మంచి వాడు ....

నా బిడ్డ ఈ ప్రపంచం లో కెల్లా నీతి మంతుడు .....

నా బిడ్డ పరోప కార బుద్ధి కలవాడు ...

నా బిడ్డ అక్రమ సంపాదన అంటే ఎరగని వాడు ....

నా బిడ్డ నలుగురి కోసం బ్రతికే వాడు ....

నా బిడ్డ ఇతరుల క్షేమం కాంక్షించే వాడు ....

etc

మొత్తం విని ఆ వేటగాడు వెళ్ళిపోయాడు .... తరువాత రోజు వేటగాడు ఒక రాబందు పిల్లని (గాజన్ )పట్టుకొని భుజాన వేసుకొని వెళుతుండగా ఆ ముసలి రాబందు ఎదురు పడి ఓరి దుర్మార్గుడ నా బిడ్డను ఏమి చెయ్యను అని మాట ఇచ్చి ఇప్పుడు పట్టుకుంటావా అని అడిగింది ..? దానికి ఆ వేటగాడు ... తల్లి నువ్వు చెప్పిన ఏఒక్క గుణం కూడా ఈ కంత్రి నాకొడుకు దెగ్గర లేవు అన్నాడు ..... దానికి ఆ రాబందు ఓరి పిచ్చి వాడ .... ఎవరయినా తన బిడ్డ గురించి తక్కువ చేసి చెప్పుకుంటార ..... ఎవరి బిడ్డ వారికి ముద్దు రా అని బదులిచ్చింది .....

దానికి ఆ వేటగాడు .. నేబిడ్డ నీకు ముద్ధయితే ఇంట్లో పెట్టుకొని గారభం చెయ్యాలి కాని ఇలా ఉరి మీద పడి నాశనం చెయ్యమని చెప్పకూడదు ....... ఒక వేల చేస్తుంటే మందలించి అదుపులో పెట్టుకోవాలి .... నువ్వు చేసిన గారభం వాళ్ళ వీడు ఇంత దారుణమయిన స్థితికి చేరుకున్నాడు ... తప్పటడుగు లు వేసిన రోజే నువ్వు సరిదిద్ది ఉంటె నీవు ఇప్పుడు ఈ క్షోభకి గురి అయ్యేదనివి కాదు ........

కథలోని నీతి నేను ప్రేత్యేకం గా చెప్పనవసరం లేదు మీరు అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్న

No comments:

Post a Comment